News March 7, 2025
సంగారెడ్డి: రెండో రోజు 97.5% హాజరు

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్షల్లో 18,852 మంది విద్యార్థులకు గాను 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారని (97.5%)ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 556 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

☛ బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
News December 8, 2025
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.
News December 8, 2025
పర్మినెంట్ హామీపై ఉమ్మడి నల్గొండ హోంగార్డుల ఆశలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న 1,200 మంది హోంగార్డులు పర్మినెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు 12 గంటలు పనిచేసినా, కేవలం ₹1000 వేతనంతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు అమలు కాకపోవడంతో వారి పరిస్థితి మారలేదు. పర్మినెంట్ చేయకపోవడంపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


