News August 12, 2025

సంగారెడ్డి: రేపటితో ముగియనున్న రైతు బీమాకు దరఖాస్తు గడువు

image

జిల్లాలో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు రేపటితో ముగుస్తుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా పాసు పుస్తకాలు పొంది 18-59ఏళ్ల వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2026

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO శంషుద్దీన్

image

కడప జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. 9 సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

News March 13, 2026

27,360 మంది విద్యార్థుల‌కు 149 సెంట‌ర్లు: కలెక్టర్

image

ఈ నెల 16వ నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వహించనున్నట్లు NTR క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఎక్క‌డా ఇబ్బంది లేకుండా విద్యార్థులు స‌జావుగా ప‌రీక్ష‌లు రాసేందుకు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు శుక్ర‌వారం ఆయన డీఈవో చంద్ర‌క‌ళ‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

News March 13, 2026

శ్రీకాకుళం: మాజీ డీజీపీ మృతి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్.జె.దొర శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా జర్జంగి గ్రామానికి చెందిన ఆయన.. విధి నిర్వహణలో అత్యంత నిజాయతీ, నిబద్ధత గల పోలీసు అధికారిగా చెరగని ముద్ర వేశారు. దొర ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, ఆయన సొంత జిల్లాకు తీరని లోటు.