News February 17, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు..కోహిర్ మండలం షెట్టేగుంట తండాలో విందుకు వెళ్లిన పవన్, శంకర్.. అనంతరం బైక్ పై సిద్దాపూర్ తండాలోని బంధువుల ఇంటికి వెళ్తన్నారు. ఈ క్రమంలో గొడిగార్‌పల్లి శివారులో మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, బైడ్ ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా శంకర్ చనిపోయారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ FIRST

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మేడ్చల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 64,146 మంది పరీక్షలు రాయగా 53,071 మంది పాసై 82.73 శాతంతో స్టేట్‌లోనే ఫస్ట్‌ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,280 మందికి 922మంది పాసై 72.03%తో 23వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 6,106 మందికి 1,904 మంది పాసై 31.18%తో 21వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 10th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. హనుమకొండకు 8వ ర్యాంక్

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. హనుమకొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 17,435 మంది పరీక్షలు రాయగా 13,698 మంది పాసై 78.57 శాతంతో స్టేట్‌లోనే 8వ ర్యాంక్ వచ్చింది.ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1003 మందికి 740 మంది పాసై 73.78 శాతంతో 19వ స్థానంలో నిలవగా, రెగ్యులర్ ప్రైవేట్‌లో 1537 మందికి 530 మంది పాసై 34.48%తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 35 మందికి 22 మంది పాసై 62.86%తో 7వ ర్యాంక్ వచ్చింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.