News November 19, 2025
సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.
Similar News
News January 15, 2026
కమ్యునికేషన్ లేకపోవడమే గొడవలకు కారణం

ఏం మాట్లాడినా గొడవలవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి వారి కమ్యునికేషన్ పాటర్న్ కారణమంటున్నారు మానసిక నిపుణులు. ఒకరు ఫీలింగ్స్ గురించి మాట్లాడితే, మరొకరు లాజికల్‌గా మాట్లాడతారు. ఒకరు ప్రజెంట్ గురించి, మరొకరు పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి దేని గురించి డిస్కస్ చేస్తున్నారో ఇద్దరికీ క్లారిటీ ఉండటం ముఖ్యమంటున్నారు. అప్పుడే బంధంలో అపార్థాలకు తావుండదని సూచిస్తున్నారు.
News January 15, 2026
ములుగు: మద్యం తాగొద్దన్నందుకు సూసైడ్

జిల్లాలోని మంగపేటలో<<18854819>> మీసేవ నిర్వాహకుడు వీర కిశోర్<<>> బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎస్సై సూరి వివరాలు.. మృతుడు కొంత కాలంగా మద్యానికి బానిసై, భార్య ఎన్ని సార్లు మందలించిన వినకుండా నిత్యం మద్యం తాగేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. కాగా, కిశోర్ ఇక నుంచి మద్యం తాగానని చెప్పాడని, బుధవారం ఉదయం చూసేసరికి వేరే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News January 15, 2026
సేంద్రియ సాగుతోనే సక్సెస్

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.


