News November 19, 2025
సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.
Similar News
News January 13, 2026
పవన్ కళ్యాణ్‌కు మోదీ అభినందన

AP: జపనీస్ <<18828407>>కత్తిసాము<<>> కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను PM మోదీ ప్రశంసించారు. ‘ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్‌లో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఫిట్ ఇండియాకు ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News January 13, 2026
తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 13, 2026
BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.


