News May 7, 2025

సంగారెడ్డి: విద్యార్థులకు’అబాకస్ ఉచిత శిక్షణ’

image

అబాకస్-2.0 యాప్ ఉచిత శిక్షణ పోస్టర్‌ను జిల్లా విద్యాధికారి సమగ్ర శిక్ష కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు గణిత నైపుణ్యాలు పెంచేందుకు ఈ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ వ్యవస్థాపకుడు గంగాధర్ మాట్లాడుతూ.. ఒకరి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పారు.

Similar News

News February 16, 2026

రోకో.. స్టైల్‌ అదుర్స్

image

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్‌గా, స్టైలిష్‌గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్‌తో అదుర్స్ అనిపించారు.

News February 16, 2026

ఫేక్ లింకులపై క్లిక్ చేయొద్దు: బాపట్ల ఎస్పీ

image

ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC అప్‌డేట్, తక్కువ వడ్డీ రుణాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

image

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.