News August 13, 2025
సంగారెడ్డి: విద్యార్థుల ఎఫ్ఆర్ఎఫ్ వెంటనే పూర్తి చేయాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ వెంటనే పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 2,090 మంది విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. 13వ తేదీ వరకు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ 100% పూర్తి చేయాలని సూచించారు. లేకుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 12, 2026
శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
News March 12, 2026
NZB: ప్రజా ప్రతినిధుల శిక్షణ సదస్సు ప్రారంభం

నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కార్పొరేట్లరు, ఛైర్మన్లు పాల్గొన్నారు.
News March 12, 2026
HYD: ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT


