News March 28, 2025
సంగారెడ్డి: వేసవిలో టీచర్ల బదిలీలు చేపట్టాలని సీఎంకు వినతి

వేసవి సెలవులో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరుతూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పులగం మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్‌తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్‌లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.
News April 18, 2025
మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 18, 2025
సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వీరుడు కర్రోల్ల నర్సయ్య

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య వర్థంతి నేడు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1957 నుండి1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో జన్మించారు. 2003లో ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించారు. నర్సయ్య భార్య దుర్గమ్మ గతంలో చనిపోయిందని, ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇటీవలే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.