News August 11, 2025
సంగారెడ్డి: ‘శిథిలావస్థలో ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించొద్దు’

సంగారెడ్డి జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యాబోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తరగతులు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.
News March 17, 2026
బాపట్ల రైతులకు JC సూచనలు

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.
News March 17, 2026
MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.


