News September 10, 2025
సంగారెడ్డి: ‘సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకుల పాత్ర కీలకం’

సంక్షేమ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు వెంటనే పంట రుణాలను మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ రావు పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా హైదరాబాద్(HYB)-భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-BBS రైలును 2026 JAN 27 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును 2026 JAN 28 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
News December 7, 2025
వర్చువల్ బ్రెయిన్‌ను తయారు చేసిన సూపర్‌కంప్యూటర్

బ్రెయిన్ పనితీరు, అల్జీమర్స్‌పై స్టడీకి సూపర్‌కంప్యూటర్ సహాయంతో సైంటిస్ట్స్ వర్చువల్ మౌస్ బ్రెయిన్ తయారు చేశారు. USలోని అలెన్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో-కమ్యూనికేషన్స్ జపాన్ ఎక్స్‌పర్ట్‌లు 9మిలియన్ న్యూరాన్లు, 26బిలియన్ల సినాప్సెస్‌తో చేసిన కార్టెక్స్ సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కలు చేయగలదు. హ్యూమన్ బ్రెయిన్ కంటే ఎలుక మెదడు చిన్నది, తక్కువ సంక్లిష్టమైనదైనా చాలా పోలికలుంటాయి.
News December 7, 2025
నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.


