News October 6, 2025

సంగారెడ్డి: ‘స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు’

image

స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. పటిష్ట బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలింపు చేపడతామని చెప్పారు. ఎన్నికల అనంతరం బందోబస్తు మధ్యే బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు రూట్ల వారీగా సిబ్బందిని నియమించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Similar News

News January 19, 2026

మేడారం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి ట్వీట్

image

మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను కాపాడుతూ, మన చారిత్రక వైభవం, ఘనమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. సమ్మక్క-సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్ల పాటు చిరస్థాయిగా నిలిచేలా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 19, 2026

చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

image

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.

News January 19, 2026

వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.