News September 10, 2025

సంగారెడ్డి: ‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Similar News

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty

News December 9, 2025

IndiGo: నెట్‌వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

image

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.

News December 9, 2025

కొత్తగూడెం: ‘హామీలు అమలు చేయకపోతే రాజీనామా’

image

గెలిపించిన మూడేళ్లలో హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని టేకులపల్లి మండలం కొత్తతండాలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్యా గీత బాండ్ పేపర్ రాసిచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, ఓపెన్ జిమ్, ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేలు, ముత్యాలమ్మ గుడి వరకు రోడ్డు ఏర్పాటు, ఎవరైనా అకాలంగా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని బాండ్ పేపర్‌లో ప్రస్తావించారు.