News February 7, 2025

సంగారెడ్డి: 10న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖల అధికారులతో కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

image

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.