News September 10, 2025
సంగారెడ్డి: 13న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ మంచి అవకాశమని చెప్పారు. బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 13, 2025
WGL: రెండో పోరు బరిలో 1,686 మంది అభ్యర్థులు

ఉమ్మడి WGL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు , 9884 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. రెండో విడతలో 564 జీపీలకు, 4937 వార్డులకు నోటిఫికేషన్ రాగా, వాటిలో 56 పంచాయతీలు, 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. హనుమకొండలో 248, వరంగల్ 354, జనగామలో 251, మహబూబాబాద్‌లో 460, భూపాలపల్లిలో 244, ములుగులో 129 మొత్తం 1686 మంది సర్పంచ్ అభ్యర్థుల భవిష్యత్ రేపటి ఆదివారం పోలింగ్‌లో తేలనుంది.
News December 13, 2025
భద్రాద్రి: ఓకే కుటుంబం నుంచి నలుగురు

పినపాక మండలంలోని సీతంపేట పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ పోతినేని శివశంకర్ 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. శివశంకర్ తండ్రి ఇస్తారి, తల్లి జయమ్మ, పిన్ని సావిత్రమ్మలు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబం నుంచి నలుగురు విజయం సాధించి, పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.


