News August 14, 2025

సంగారెడ్డి: 20 మందితో బీజేపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు

image

సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రకటించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కార్యవర్గంలో 20 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రాజశేఖర్ రెడ్డి, పోచారం రాములు పాల్గొన్నారు.

Similar News

News March 13, 2026

వనపర్తి: క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండటం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట పీహెచ్సీలో సనచారిటబుల్ ట్రస్ట్, ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారిని ముందుగా పరీక్షలతో గుర్తించడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చన్నారు.

News March 13, 2026

ఉమ్మడి విశాఖలో రేపు జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్‌లో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

News March 13, 2026

కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

image

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in