News March 4, 2025
సంగారెడ్డి: 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

మంజీర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తికి చెందిన సునీల్ చౌహాన్(23) కొన్ని రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన సునీల్ తిరిగి రాలేదు. హద్నూర్ పోలీసులు రాఘవపూర్ శివారులో మంజీర నది బ్రిడ్జిపై అతడి బైక్ గుర్తించారు. నదిలో నిన్న సునీల్ మృతదేహం దొరికింది. ఈనెల 26న సునీల్ పెళ్లి జరగాల్సి ఉంది.
Similar News
News December 14, 2025
దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
గద్వాల్: 2,300 ఓట్ల భారీ మెజారిటీతో విజయం

అయిజ మండలం పులికల్ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాణిక్యమ్మ తన సమీప ప్రత్యర్థి మాల లక్ష్మీపై 2300 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయిజ మండలం పులికల్ గ్రామంలో మొత్తం 3,607 ఓట్లు ఉండగా మాణిక్యమ్మ 2300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం మండలంలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఈమె అత్యధిక మెజారిటీ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.


