News February 10, 2025

సంగారెడ్డి: 307 మంది బడి బయట పిల్లల గుర్తింపు

image

సంగారెడ్డి జిల్లాలో గత నెల 16 నుంచి 31 వరకు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వేలో 307 మంది విద్యార్థులను గుర్తించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యం, వయసు ప్రకారం వీరి అర్హత, ఆసక్తిని బట్టి తగిన తరగతిలో చేర్పించడం, దూర విద్యలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

సిద్దిపేట: సాగునీటి విడుదలపై హరీశ్ రావు సమీక్ష

image

మల్లన్న సాగర్ నీటి విడుదల, సాగునీటి ప్రాజెక్టుల పనులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ గడ్డిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. చంద్రపూర్ లిఫ్ట్ పనులను వేగవంతం చేసి మూడు నెలల్లో ప్రారంభించాలని సూచించారు. సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్న సాగర్ నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.

News February 12, 2026

పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి: సీతక్క

image

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం రూ.387 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.259.36 కోట్లు ఇచ్చింది. తాజా విడతతో కలిపి మొత్తం రూ.646.36 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు ఇంకా సుమారు రూ.3,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలు పూర్తి చేసి కేంద్రానికి సమాచారం అందించామని, మిగిలిన నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.

News February 12, 2026

ఓటుతో సామాజిక మార్పు.. ట్రాన్స్‌జెండర్ల పౌర చైతన్యం

image

ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా పాల్గొని పౌర బాధ్యత చాటారు. జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, వారిలో 17 మంది (దాదాపు 71%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 11 మంది, మధిరలో ముగ్గురు, ఎదులాపురంలో ఇద్దరు, వైరాలో ఒకరు చొప్పున ఓటు వేశారు. సామాజిక గుర్తింపు, మార్పు కోసమే తాము ఓటు వేసినట్లు వారు పేర్కొన్నారు.