News September 11, 2025

సంగారెడ్డి: ’42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం’

image

42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయంగా న్యాయం జరుగుతుందని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. సంగారెడ్డిలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.

News December 17, 2025

సూర్యాపేట: ఓటు వేసిన వందేళ్ల బామ్మ..!

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మఠంపల్లి మండలం బక్కమంతల గూడెం గ్రామంలో శతాధిక వయస్సు గల మామిడి నాగరత్నమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేయడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News December 17, 2025

ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

image

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.