News October 6, 2025
సంగారెడ్డి: 7న ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ పోటీలు 7వ తేదీన సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. బాల,బాలికల అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99481 03605 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Similar News
News January 18, 2026
పార్వతీపురం: ఉదయాన్నే యాక్సిడెంట్.. మహిళ మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన గుండ్రెడ్డి అప్పమ్మ (68) పాలు తీసుకునేందుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గురుగుబిల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News January 18, 2026
NZB: RTC ద్వారా సమ్మక్క-సారక్క ప్రసాదం: RM

మేడారం వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 299లకే సమ్మక్క-సారక్క ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందజేస్తామని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. శనివారం కరపత్రాలను ఆవిష్కరించిన ఆమె.. భక్తులు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో లేదా సంస్థ వెబ్‌సైట్ www.tgsrtclogistics. co.in సైట్ ద్వారాబుక్ చేసుకోవచ్చన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు.
News January 18, 2026
పాలమూరు: రెండు మున్సిపాలిటీలకు ఎలక్షన్ లేవు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మే 6 వరకు ఉండటంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలేదు. కానీ రిజర్వేషన్లు మాత్రం ఖరారు చేసింది. అచ్చంపేట బీసీ మహిళ, జడ్చర్ల స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. దీంతో ఉమ్మడి MBNR జిల్లాలో 19 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.


