News August 20, 2025

సంగారెడ్డి: 77 డెంగ్యూ కేసులు నమోదు

image

జిల్లాలో ఇప్పటివరకు 77 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 7వ తేదీన ప్రారంభమైన జ్వర సర్వే 96,752 ఇళ్లను సందర్శించినట్లు పేర్కొన్నారు. 3,88,882 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఈనెల చివరి వరకు జ్వర సర్వే పూర్తి చేస్తామని వివరించారు.

Similar News

News January 18, 2026

పోచంపల్లి ఇక్కత్‌కు జర్మనీ దేశస్థులు ఫిదా!

image

అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీని చూసి జర్మనీ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు. ఆదివారం వారు భూదాన్ పోచంపల్లిని సందర్శించి, టూరిజం పార్కులోని మగ్గాలను పరిశీలించారు. నూలుదారానికి రంగులు అద్దడం, చిటికిలుచుట్టడం, మగ్గంపై చీర నేసే ప్రక్రియను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దుకాణాల్లో ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వారు అభినందించారు.

News January 18, 2026

సీఎం పర్యటనకు ఇందిరమ్మ చీరలతో రాకుంటే జరిమానా!

image

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు డ్వాక్రా మహిళా సంఘాలను రావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలతో సీఎం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని లేకుంటే రూ.500, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బలవంతంగా పనులు వదిలేసి తాము ఎలా వెళ్లాలని మహిళా సంఘాలు సతమతమవుతున్నారని సమాచారం.

News January 18, 2026

తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

image

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.