News November 19, 2025

సంచలనం.. ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం?

image

ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఇవాళ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ Pvt Ltd ప్రింటింగ్ ప్రెస్‌లో ATS తనిఖీలు చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించింది. CCTV ఫుటేజ్‌, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ 2022లో తుర్కియేకు వెళ్లి ఫారిన్ హ్యాండ్లర్ ఉకాసాను కలిసినట్లు సమాచారం.

Similar News

News January 21, 2026

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 21, 2026

FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.