News May 22, 2024

సందర్శకులతో కిటకిటలాడుతున్న విశాఖ జూ

image

వేసవి సందర్భంగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్‌లో సందడి నెలకొంది. కొద్ది రోజులుగా జూ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు, పెద్దలు వందలాది మంది జూని సందర్శిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జూ పార్కుకు వస్తున్నారు. సందర్శకులు వన్యప్రాణులను తిలకిస్తూ ఆనందిస్తున్నారు.

Similar News

News March 15, 2026

విశాఖలో చికెన్ రూ.310

image

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్‌ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

News March 15, 2026

వైజాగ్ స్టీల్ సీఎండీగా ప్రభాకర్..!

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పదవికి MNVS.ప్రభాకర్ పేరును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన NMCS స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

News March 14, 2026

విశాఖలో నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల నియామకం

image

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.