News November 30, 2025
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం నమోదు చేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచులో శతకంతో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు నమోదు చేశారు. టెస్టు ఫార్మాట్‌లో 51 సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. కాగా మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 శతకాలు నమోదు చేయగా, కోహ్లీ 83 సెంచరీలు చేశారు.
Similar News
News February 18, 2026
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

T20WC: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in
News February 18, 2026
భూ రిజిస్ట్రేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టం: పొంగులేటి

TG: ధరణి పోర్టల్‌లోని వ్యవస్థీకృత లోపాల వల్లనే రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహా సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకు దారితీసింది. వారినెవరినీ వదిలిపెట్టం. కోడ్ ఆడిట్‌కు ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండరాదు’ అని పేర్కొన్నారు.


