News May 13, 2024
సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ధర్మపురి అర్వింద్

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌లో గల కాకతీయ స్కూల్ క్యాంపస్ పోలింగ్ బూత్‌లో ఆయన సతీమణి తో కలిసి ఓటు వేశారు. ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News December 15, 2025
నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు !

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ సోమవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధం అని తెలిపారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
News December 15, 2025
నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.
News December 15, 2025
నిజామాబాద్: నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి

ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్‌లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖరు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.


