News May 25, 2024
సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం 43,988 మంది నమోదు

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు అందించే రాయితీ విత్తనాలకు 43,988 మంది పేర్లను నమోదు చేసుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. రైతులకు పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 43,988 మంది రైతులకు అనుగుణంగా 37,419 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు.
Similar News
News February 11, 2025
ఆనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు

అనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు వచ్చినట్లు అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపి ఆదేశాలు జారీ చేశారు.
News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.