News August 15, 2025

సత్యసాయి జిల్లాలో 320 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

image

రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం సాయంత్రం ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. జిల్లాలో 320 బస్సులు సిద్ధం చేశామని, అంతర్రాష్ట్ర, సూపర్ లగ్జరీ బస్సులు మినహా మిగతా బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు. మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.

Similar News

News March 13, 2026

గాలి నుంచి నీరు.. తిరుపతి IIT విద్యార్థుల ప్రయోగం

image

గాలిని తీసుకుని అందులోని తేమను స్వీకరించి స్వచ్ఛమైన నీటిగా మార్చే యంత్రాన్ని తిరుపతి ఐఐటీ విద్యార్థులు రూపొందించారు. ‘ఎయిర్ టూ వాటర్’ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో అందుబాటులో ఉంచారు. గాలి నుంచి నీటిని సేకరించే బీటిల్స్, ఎడారిలో నివసించే కాక్టస్ మొక్కల నుంచి ప్రేరణతో దీనిని తయారుచేశారు. ఓ తమిళ సూపర్ స్టార్ వీటిని తనకు కావాలని ఆర్డర్ పెట్టించుకున్నట్లు సమాచారం.

News March 13, 2026

యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.

News March 13, 2026

జిల్లా రైతాంగంపై రూ.35 కోట్ల అదనపు భారం!

image

పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, ఈ ధరల పెరుగుదల వల్ల జిల్లా రైతాంగంపై సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.