News September 12, 2025

సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు ఘన వీడ్కోలు

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌కు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవోలు, అధికారులు శాలువాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనని, అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రభుత్వం చేతన్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కొత్త కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు.

Similar News

News December 17, 2025

కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

image

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్‌లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.

News December 17, 2025

ఇతిహాసాలు క్విజ్ – 99

image

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 17, 2025

CUSB 84 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB) 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in