News March 7, 2025
సత్యసాయి: ‘నైపుణ్యాలను తప్పక పెంచుకోవాలి’

విధులలో నైపుణ్యాలు మెరుగుపరచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని రాయలసీమ రీజియన్ ఇన్‌ఛార్జి హోంగార్డ్స్ కమాండెంట్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు జిల్లాలోని హోంగార్డ్స్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
Similar News
News December 17, 2025
ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 17, 2025
T20 సిరీస్ పట్టేస్తారా?

SAతో ఇవాళ IND నాలుగో T20 ఆడనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న IND సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అటు చివరి T20 వరకు సిరీస్ విజేతను వాయిదా వేయాలని SA బరిలోకి దిగనుంది. గత 20+ మ్యాచులుగా విఫలమవుతున్న సూర్య ఫామ్ అందుకుంటారా? లేదా? అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిల్ సైతం రన్స్ చేయాల్సి ఉంది. లక్నో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడి ఎకానా స్టేడియంలో ఆడిన 3 T20ల్లోనూ IND గెలిచింది.
News December 17, 2025
అగరుబత్తీలతో ఆరోగ్యం.. ఇలా చేయండి

సువాసన గల అగరుబత్తీలు ఇంట్లో ధ్యానానికి, పూజకు అనుకూలంగా సానుకూల శక్తిని నింపుతాయి. అయితే దోమల కోసం వాడే రసాయన అగరుబత్తీలుు అలా కాదు. అవి ఆరోగ్యాన్ని, శ్వాసకోశాన్ని పాడుచేస్తాయి. అందుకే సాధారణ అగరుబత్తీలకే బామ్ వంటిది పూసి వెలిగించడం వల్ల దోమలు దూరమవుతాయి. దీనివల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి కూడా ఆటంకం కలగదు. ఈ సురక్షిత మార్గం ద్వారా దేవతా పూజకు అవసరమైన పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.


