News November 6, 2025
సత్యసాయి బాబా సూక్తులు

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.
Similar News
News January 23, 2026
ఒక్క బంతికే 11 రన్స్

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.
News January 23, 2026
SRPT: లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ

రాజేశ్ లాకప్ డెత్‌కు కారకులైన పోలీసులపై ఇతర శాఖల అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అఖిలపక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ అన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.
News January 23, 2026
రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా ఫస్ట్

గంజాయిని నివారించడంలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కీ పెర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 76.2 శాతంతో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బాపట్ల జిల్లాలో ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ ముందు వరసలో నిలపటం పట్ల ఈగల్ DIG రవికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.


