News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News January 16, 2026
ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
News January 16, 2026
కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 16, 2026
కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.


