News May 7, 2025
సన్న వడ్ల సేకరణకు రైస్ మిల్లులు సిద్ధం: సిరిసిల్ల కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతులు తమ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో సరైన తేమశాతంతో విక్రయించాలని సూచించారు. జిల్లాలోని 18 రైస్ మిల్లులు సన్న వడ్లు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
Similar News
News February 16, 2026
రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు: అమిత్ షా

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు <<19151159>>ద్రోహం చేస్తోందని<<>> రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.
News February 16, 2026
అటు బంగ్లా, ఇటు పాక్‌కు చెక్ పెట్టిన భారత్

తమ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి పౌరులకు భద్రత కల్పించిన భారత్‌లోనే రక్షణ లేదంటూ బంగ్లాదేశ్ అహంకారం ఒకవైపు. ‘మేం కూడా భారత్‌తో మ్యాచ్ ఆడం’ అంటూ చివరి వరకు నక్క తెలివితేటలు చూపిన పాకిస్థాన్ మరోవైపు. ఈ రెండు దేశాల తలపొగరును <<19153355>>తన ఆటతో<<>> దించేసింది టీమ్ ఇండియా. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ మాదిరిగా చాలా పద్ధతిగా, సమష్టిగా దెబ్బకొట్టింది. ‘తగ్గేదేలే’ అంటూ భారత్ మరోసారి సత్తా చాటింది.
News February 16, 2026
TODAY HEADLINES

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!


