News November 7, 2025

సబ్బవరం: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News January 18, 2026

HNK: తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

image

తండ్రి మందలించాడన్న కారణంతో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో విఘ్నేశ్(17) అనే ఇంటర్ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హసన్‌పర్తి పోలీసులు తెలిపారు. విఘ్నేశ్ HNK రామారంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలో చేర్పించగా, కాలేజీకి వెళ్లకుండా చెడు తిరుగుల్లు తిరుగుతుండగా తండ్రి రమేశ్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.

News January 18, 2026

పెద్దపల్లి: ‘మున్సిపల్ ఎన్నికల్లో గౌడలకు 4 సీట్లు కావాలి’

image

మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీకే మద్దతు ఇస్తామని పెద్దపల్లి గౌడ సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో గౌడలకు 10 వేలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. 36 వార్డుల్లో కనీసం 4 సీట్లు గౌడలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

News January 18, 2026

జగిత్యాల: ‘అభివృద్ధి కోసం సీఎం‌ను కలిస్తే రాజకీయ దాడులా?’

image

JGTLలో నిర్వహించిన మీడియా సమావేశంలో MLA సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. JGTL అభివృద్ధి కోసం CMను కలిసినందుకు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. హింసాత్మక రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా JGTLను అభివృద్ధి చేసి తీరుతామన్నారు.