News November 10, 2024
సమగ్ర సర్వేపై అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలి: కలెక్టర్ త్రిపాటి
సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటి కుటుంబ సర్వేపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువల్ల సర్వేకు సంబంధించి ప్రజలలో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సమగ్ర సర్వేపై ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 7, 2024
నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణవెల్లంలకు చేరుకుంటారు. 2.40 గంటలకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. 3.20గంటలకు యాదాద్రి ధర్మల్ పవర్ యూనిట్ -2 శక్తివంత స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజ్‌ని ప్రారంభిస్తారు. 5-6 గంటలకు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.
News December 6, 2024
సీఎం రేవంత్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా పర్యటన ఏర్పాట్లను మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు మంత్రులు తగిన సూచనలు చేశారు.
News December 6, 2024
NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు
నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.