News August 21, 2025
సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం: కలెక్టర్

గ్రామ సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలులోని సునయన ఆడిటోరియంలో స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అధికారులు ప్రతీ గ్రామానికి వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలన్నారు.
Similar News
News January 24, 2026
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News January 24, 2026
ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి: జిల్లా కలెక్టర్

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సరి సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ‘జీరో- గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ అనే థీమ్‌తో ర్యాలీనీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్కలను నాటారు.
News January 24, 2026
వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


