News November 5, 2025
సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News January 17, 2026
మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు

AP: సంక్రాంతి పండుగను కుటుంబంతో ఆనందంగా గడిపిన ప్రజలు మధుర జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని పల్లెలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం తిరిగి నగరాల బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా RTC ప్రత్యేక బస్సులు, SCR ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
News January 16, 2026
₹లక్ష పెట్టుబడికి ₹4 లక్షల రిటర్న్స్!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది. 2019 జులై (సిరీస్-II)లో ₹లక్ష పెట్టిన వారికి నేడు వాటి విలువ ఏకంగా ₹4.15 లక్షలకు చేరింది. RBI ప్రకటించిన తాజా రిడెంప్షన్ ధర ప్రకారం.. గ్రాము బంగారం విలువ ₹14,092గా ఉంది. అంటే ఐదేళ్ల క్రితం ₹3,393కే కొన్న బాండ్లపై ఏకంగా 315% లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా వచ్చే 2.5% వడ్డీ బోనస్! మీ దగ్గర SGBలున్నాయా? Comment
News January 16, 2026
రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్‌ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.


