News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News February 10, 2026
కనులపండువగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News February 10, 2026
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.
News February 10, 2026
రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సెలవు

ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. అర్హత గల ఉద్యోగులు పోలింగ్ రోజున ప్రత్యేక సాధారణ సెలవు సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.


