News November 16, 2025

సరికొత్త రీతిలో మోసాలు.. జాగ్రత్త: ADB SP

image

సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతీలో మోసం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. గతవారం జిల్లాలో 11 కేసులో నమోదైనట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ జాబ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, లోన్ ఇస్తామంటూ వచ్చే యాడ్స్ నమ్మవద్దని వివరించారు. రూ.2 నోటుకు రూ.32 లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రచారాలు అవాస్తవమని వాటిని నమ్మకూడదన్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News January 23, 2026

కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

image

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.

News January 23, 2026

రక్తంతో నారా లోకేశ్ చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో మంత్రి నారా లోకేశ్ చిత్రాన్ని గీశారు. లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ వినూత్న చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. లోకేశ్ తెలుగు ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శ్రీనివాసులు ఆకాంక్షించారు.

News January 23, 2026

ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

image

రాబోయే మూడేళ్ల‌లో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వ‌ర‌కు త‌గ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తెలిపారు. విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని అన్నారు. నాణ్య‌మైన విద్యుత్ త‌క్కువ ధ‌ర‌ల‌కు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.