News August 22, 2025

సరిహద్దులను గుర్తించడానికి స్వమిత్వ సర్వే: జేసీ

image

గ్రామాలలో నివసించే ప్రజలకు ఉన్న భూమి హక్కులను నిర్ధారించడానికి గ్రామ సరిహద్దులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియే స్వమిత్వ సర్వే అని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఈ సర్వే నిర్వహణపై జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమీక్షించారు. సర్వే నిర్వహణ దశలను వారికి వివరించారు.

Similar News

News January 14, 2026

రేపు భోగి.. ఏం చేస్తారంటే?

image

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.

News January 14, 2026

HYD: బోగి మంటలు.. సంప్రదాయం వర్సెస్ ఆధునికం

image

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్‌ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.