News December 17, 2025

సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

image

TG: రాష్ట్రంలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Similar News

News January 19, 2026

పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

image

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్‌స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్‌లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్‌స్కీ కశ్మీర్‌పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.

News January 19, 2026

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్‌లో ప్రకటన?

image

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.

News January 19, 2026

6 గంటలకుపైగా విజయ్‌ను విచారించిన సీబీఐ

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ దళపతిని సీబీఐ రెండోసారి విచారించింది. సుమారు 6 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. అయితే ఆరోజు ఆయనను సాక్షిగా ప్రశ్నించగా, ఇవాళ అనుమానితుడిగా ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.