News February 7, 2025
సర్పంచ్ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీలు 5, గ్రామ పంచాయతీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC-230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.
Similar News
News February 19, 2026
ASF జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

సాంఘిక సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 22న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,847 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News February 19, 2026
ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News February 19, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.


