News March 4, 2025

సర్వేలు త్వరగా పూర్తి చేయండి: జేసీ

image

అల్లూరి జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల సర్వేలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు లేని పిల్లలు, జనన మరణాల ఆలస్య నమోదు, స్కూల్ టాయిలెట్ తనిఖీ, వర్క్ ఫ్రమ్ హోం, పీ4, తదితర సర్వేలు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Similar News

News December 13, 2025

అల్లూరి: మొదటిసారి తీసుకున్న నిర్ణయం.. 9 మంది మృతి

image

అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం 9మంది ఆయువు తీసింది. అల్లూరి బస్సు ప్రమాద ఘటనలో.. ట్రావెల్స్ యజమాని 1993 నుంచి ఈ రంగంలో ఉన్నారు. పన్నీరుసెల్వం వజ్రమణి(ఏజెంట్) ద్వారా యాత్రలు చేపడుతుంటాడు. 22 ఏళ్లలో ఎప్పుడూ వజ్రమణి రాత్రి ప్రయాణం చేయలేదట. టూర్ ఆలస్యం కావడంతో మొదటిసారి రాత్రి ప్రయాణం చేశారంట. భద్రాచలం యాత్ర సైతం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమంట. పొగమంచు, అతివేగం సైతం 8 కుటుంబాల్లో విషాదం నింపింది.

News December 13, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్‌లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

News December 13, 2025

కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

image

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.