News August 11, 2025

సహకార బ్యాంకులు రైతులకు తోడ్పడాలి: శ్రీధర్ బాబు

image

రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగపడాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం కమాన్‌పూర్ మండలంలో రూ.65 లక్షలతో నిర్మించిన నూతన PACS భవనాన్ని, రూ.79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని డీసీసీబీ ఛైర్మన్ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్షలతో కలిసి మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో RDO సురేష్, PACS ఛైర్మన్ భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు

Similar News

News March 17, 2026

రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

image

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.

News March 17, 2026

అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

News March 17, 2026

జగిత్యాల: కుక్క కాటు.. ప్రాణం తీసింది..!

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మణితేజ(7) కుక్కకాటుకు గురై, 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2024 డిసెంబర్ 26న మెడ భాగంలో కుక్క కరవడంతో వెంటనే HYDలో చికిత్స అందించారు. అనంతరం ఇంట్లోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యం కొనసాగించారు. సుమారు రూ.65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు.