News April 23, 2025

సాగర్ కలుషితం తీరుతుందెప్పుడో!

image

HYDలోని హుస్సేన్ సాగర్ రోజురోజుకు కలుషితం అవుతోంది. ఇటీవలే PCB నిర్వహించిన వాటర్ క్వాలిటీ టెస్ట్ రిపోర్టులో ఇది వెల్లడైంది. ఖైరతాబాద్ STP, సంజీవయ్య పార్కు వద్ద BOD స్థాయి పరిమితికి మించి 86,92గా భారీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటి జీవరాశులు బతికేందుకు నీటిలో కరిగే ఆక్సిజన్ అవసరం. దీని స్థాయి రోజురోజుకూ అనేక ప్రాంతాల్లో తగ్గుతున్నట్లు PCB లెక్కల్లో తేలింది.

Similar News

News March 16, 2026

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.

News March 16, 2026

వరంగల్: 104 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 104 మంది పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 56, వెస్ట్ జోన్‌లో 18, ఈస్ట్ జోన్‌లో 16, సెంట్రల్ జోన్‌లో 14 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

News March 16, 2026

ADB: ఇంటర్ అమ్మాయిలకు మంచి అవకాశం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 65 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.