News August 4, 2024

సాగర్ జల సవ్వడులకు నేటితో 57 ఏళ్లు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మొట్టమొదటిసారి నీటిని విడుదల చేసి నేటితో 57ఏళ్లు నిండాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 15, 2025

NLG: సాఫ్ట్‌వేర్‌ TO సర్పంచ్‌

image

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.

News December 15, 2025

NLG: రెండో విడతలోనూ ఆ పార్టీదే హవా

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మొదటి రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాలు గెలుపొందారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా.. బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. రెండో విడతలోను బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.

News December 15, 2025

MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

image

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.