News August 13, 2025

సాగుచేసే రైతులకే యూరియా అమ్మకం: కలెక్టర్

image

జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వ్యవసాయ అధికారులతో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాష క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,788 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. యూరియా కొరత లేదని, జిల్లాలో సాగు చేసే రైతులకే యూరియా అమ్మకం చేపట్టాలని, రైతులు అవసరాన్ని బట్టి కొనుగోలు చేసేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 10, 2026

పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నిరూపిస్తూ పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతమైంది. లింగపుట్టు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి పాపిల్లరీ కార్సినోమా థైరాయిడ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

News March 10, 2026

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

News March 10, 2026

ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌‌కు ICC ఫైన్

image

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్‌ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.