News November 19, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2026

ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News January 23, 2026

45 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు: కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోపు పునాది పనులు ప్రారంభించని పక్షంలో, ఆ మంజూరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. రద్దయిన చోట కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఎంపీడీఓలు, తహశీల్దార్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

News January 23, 2026

గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు!

image

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్‌’, ‘రెస్టిన్‌’ హోటల్‌ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.