News November 19, 2025

సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

image

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.

Similar News

News January 17, 2026

పాలమూరు జిల్లా మునిసిపల్ రిజర్వేషన్లు ఇలా..!

image

పాలమూరు కార్పొరేషన్ మేయర్ బీసీ మహిళకు కేటాయించగా..భూత్పూర్ ఎస్టీ జనరల్, జడ్చర్ల జనరల్, దేవరకద్ర బీసీ మహిళ, గద్వాల జనరల్ మహిళ, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి బీసీ జనరల్, నాగర్‌కర్నూల్ బీసీ జనరల్, కొల్లాపూర్, అచ్చంపేట బీసీ మహిళలకు, కల్వకుర్తి జనరల్ మహిళ, నారాయణపేట, కోస్గి జనరల్ మహిళ, మక్తల్ జనరల్, మద్దూరు బీసీ జనరల్, వనపర్తి జనరల్ మహిళ, కొత్తకోట,ఆత్మకూరు బీసీ మహిళలకు, అమరచింత బీసీ జనరల్‌కు దక్కాయి.

News January 17, 2026

కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

image

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.

News January 17, 2026

వీరు చంద్రుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం

image

మనస్సుకు కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత లేనివారు, అనవసర భయాలతో ఆందోళన చెందేవారు చంద్రుడిని ఆరాధించాలి. చర్మ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పూజ మేలు చేస్తుంది. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం చంద్రుడిని ప్రార్థించడం ఎంతో అవసరం.