News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News January 18, 2026
KGHలో శవాల మీద డబ్బులు వసూలు..!

KGHలో లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి లంచం ఇవ్వాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆఖరికి శవాల మీదా డబ్బులు వసూలు చేస్తున్నారంట. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిన్న KGHని విజిట్ చేయగా.. శానిటేషన్ వర్కర్ డబ్బులు అడుగుతున్నట్లు రోగి బంధువులు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురైందా?
News January 18, 2026
కామారెడ్డి: చికెన్@310

కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు గత పది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కిలో చికెన్ రూ. 300 నుంచి రూ. 310 వరకు విక్రయించారు. మటన్ ధర కిలో రూ. 800 వద్ద స్థిరంగా ఉంది. కోళ్ల దాణా ధరలు భారీగా పెరగడం వల్లే చికెన్ ధరలు తగ్గడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలపై మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2026
అన్నమయ్య: ఇద్దరు యువకుల మృతి

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకులు మృతిచెందడం కలకలం రేపింది. KVపల్లె మండలం బండ వడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం రాత్రి 8గంటల సమయంలో మద్యం తాగారు. అందులో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే గర్నిమిట్ట ఆసుపత్రికి తరలించగా మణికుమార్(34) చనిపోయాడు. పరిస్థితి విషమించిన పుష్పరాజ్(26)ను పీలేరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


