News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News January 18, 2026
ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 18, 2026
ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం.. పోటెత్తిన భక్తులు!

అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ఈ విశేష హోమంలో 233 మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 91 మంది పరోక్షంగా ఆన్‌లైన్ సేవ ద్వారా భాగస్వాములయ్యారు.
News January 18, 2026
HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.


