News November 19, 2025

సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

image

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.

Similar News

News January 23, 2026

పూర్తిగా సహకరించా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

News January 23, 2026

ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ‘నా భారతదేశం – నా ఓటు’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News January 23, 2026

జియ్యమ్మవలస: ముగ్గురి మృతిపై ఎస్పీ ఆరా.. దర్యాప్తునకు ఆదేశం!

image

జియ్యమ్మవలస(M) వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటనపై ఎస్పీ మాధవరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన చినమేరంగి PHCని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ విషాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.